Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ

Revanth Reddy Meets PCC Chief Mahesh Kumar Goud
  • జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సమావేశం
  • సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్
  • పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్‌పై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్‌లపై ఢిల్లీలో పోరాడేందుకు కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది.

ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.

మరుసటి రోజు అంటే 6న జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొంటారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేస్తారు. ఇందుకోసం ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి వెళతారు. ఢిల్లీ పర్యటన తర్వాత పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.
Revanth Reddy
Telangana Congress
Mahesh Kumar Goud
Meenakshi Natarajan
BC Reservations

More Telugu News