Ayyanna Patrudu: ఏం కావాలని ఎన్టీఆర్ అడిగితే... డిగ్రీ కాలేజి అడిగాను: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu I asked NTR for degree college
  • నర్సీపట్నంలో ఓ నర్సింగ్ కాలేజీలో ల్యాంప్ లైటింగ్ సెర్మనీ
  • హాజరైన ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
  • చదువుకోవడం అంటే తనకు బాగా ఇష్టమని వెల్లడి
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో మదర్ నర్సింగ్ విద్యాసంస్థలో జరిగిన 'ల్యాంప్ లైటింగ్ సెర్మనీ' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరంగా ప్రసంగించారు. చదువు అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. అయితే ఇంటర్ అయిపోయాక ఎక్కడికెళ్లి చదువుకోవాలో తనకు తెలియలేదని, నర్సీపట్నంలో డిగ్రీ కాలేజీ లేకపోవడంతో కాకినాడ వెళ్లి చదువుకున్నానని వెల్లడించారు.

ఆ తర్వాత తాను టీడీపీలో చేరి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాక, ఏం కావాలని ఎన్టీఆర్ అడిగారని అయ్యన్నపాత్రుడు గుర్తుచేసుకున్నారు. అప్పటికి తాను అందరికంటే చిన్న వయసు ఎమ్మెల్యేనని, తనలాగా చదువు కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదని భావించి, తన నియోజకవర్గానికి డిగ్రీ కాలేజి అడిగానని వివరించారు. అక్కడ్నించి, నర్సీపట్నంను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలన్న లక్ష్యంతో కృషి చేశానని... తన నియోజకవర్గానికి పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్, బీఈడీ కాలేజి... ఇలా పలు విద్యాసంస్థలను తీసుకువచ్చానని అయ్యన్న వెల్లడించారు. 
Ayyanna Patrudu
NTR
Narsipatnam
Andhra Pradesh Assembly
Education
Degree College
TDP
MLA
Lamp Lighting Ceremony
Mother Nursing Institution

More Telugu News