Tsunami: మరిన్ని దేశాలకు సునామీ ముప్పు... వివరాలు ఇవిగో!

Tsunami Threat Increased to More Countries After Russia Earthquake
  • రష్యాలో భారీ భూకంపం
  • రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రత నమోదు
  • పలు దేశాల్లో 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో అలలు
  • అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ తాజా అలర్ట్  
రష్యాలో భారీ భూకంపం సంభవించడంతో ప్రపంచ దేశాల్లోనూ కలకలం రేగింది. 8.8 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో పలు దేశాలను సునామీ తాకింది. తాజాగా, అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ మరికొన్ని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 

రష్యా, హవాయి దీవులు, ఈక్వెడార్ 3 మీటర్ల కంటే ఎత్తయిన అలలతో సునామీ వచ్చే అవకాశం ఉంది. 

జపాన్, చిలీ, కోస్టారికా, పెరు, సోలోమన్ ఐలాండ్స్, కిరిబాటి, సమోవా, ఫ్రెంచ్ పాలినేషియా దీవులు, గ్వామ్, పాల్మిరా ఐలాండ్, మిడ్ వే ఐలాండ్, జాన్ స్టన్ అటోల్, జార్విస్ దీవులకు 1 మీటర్ నుంచి 3 మీటర్ల అలలతో సునామీ వచ్చే అవకాశం ఉంది. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిజీ, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలా, పపువా న్యూగినీ, తైవాన్, ఫిలిప్పీన్స్, నికరాగువా, మెక్సికో, కొలంబియా, పనామా, కుక్ ఐలాండ్స్, అంటార్కిటికా ప్రాంతాలకు 0.3 మీటర్ల నుంచి 1 మీటరు ఎత్తు అలలో సునామీ వచ్చే అవకాశం ఉంది. 

చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రూనై, మలేషియా దేశాలకు 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తుతో అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ వెల్లడించింది. 
Tsunami
Russia earthquake
tsunami warning
earthquake
tsunami alert
Hawaii islands
Japan tsunami
Pacific Ocean tsunami
coastal areas
natural disaster

More Telugu News