Nagababu: జనసేన నేత మైక్ కట్ చేయాలన్న నాగబాబు.. వీడియో ఇదిగో!

Janasena Leader Nagababu Reacts to Discontent Over Coalition Government
  • కూటమిలో జనసేన నేతలకు గుర్తింపు దక్కడంలేదని కార్యకర్త ఆవేదన
  • విశాఖ సౌత్ లో ఎమ్మెల్యే జనసేన నేతే అయినా ఆధిపత్యం టీడీపీ వాళ్లదే..
  • పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లండంటూ నాగబాబుకు స్థానిక నేత విజ్ఞప్తి
  • కూటమిలో మనస్పర్థల విషయం సమన్వయ కమిటీ చూసుకుంటుందన్న నాగబాబు
కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలకు తగిన గుర్తింపు లేదంటూ విశాఖపట్నం జనసేన నేత గోపికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు పార్టీ సీనియర్ నేత నాగబాబుకు తమ ఆవేదన వెలిబుచ్చారు. విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ కార్యాలయంలో నాగబాబు సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గోపీకృష్ణ వేదికపై మాట్లాడుతూ.. విశాఖ సౌత్‌ ఎమ్మెల్యే జనసేన నేతే అయినా ఆధిపత్యం అంతా టీడీపీదే ఉందన్నారు. ఈ అన్యాయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళండంటూ నాగబాబుకు విజ్ఞప్తి చేశారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన నాగబాబు.. మైక్ కట్ చేసేయండంటూ అనుచరులను ఆదేశించారు.

అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. కూటమి ఏర్పాటు, ఎన్నికల్లో విజయానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్, భాజపా నేతలు కృషి చేశారని చెప్పారు. పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందవద్దని, దామాషా ప్రకారం నామినేటెడ్‌ పోస్టులు వస్తాయని వివరించారు. కూటమిలోని పార్టీల నాయకులతో అపార్థాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకొంటుందని చెప్పారు.

ఈ విషయంలో కార్యకర్తలు స్పందించవద్దని నాగబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, డీసీసీబీ ఛైర్మన్‌ కోన తాతారావు తదితరులు పాల్గొన్నారు.
Nagababu
Janasena
Andhra Pradesh Politics
Visakhapatnam
Gopikrishna
Pawan Kalyan
TDP
Coalition Government
Vamsikrishna Srinivas
Konathata Rao

More Telugu News