Soori: 40 కోట్లు రాబట్టిన సూరి మూవీ .. ఇప్పుడు ఓటీటీలో!

Maman Movie Update
  • సూరి హీరోగా రూపొందిన 'మామన్'
  • మే 16న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • 40 కోట్లను తెచ్చిపెట్టిన కంటెంట్ 
  • ఆగస్టు 8వ తేదీ నుంచి జీ 5లో

కమెడియన్స్ హీరోలుగా మారడమనేది చాలా కాలం నుంచి వస్తున్నదే. అలా తమిళంలో సంతానం తర్వాత హీరోగా మారిన స్టార్ కమెడియన్ ఎవరైనా ఉన్నారా అంటే అది 'సూరి' అనే చెప్పాలి. కాస్త నల్లగా .. బక్కపలచగా కనిపించే సూరి, హాస్యాన్ని బాగా పండిస్తాడు. కొన్ని పాత్రలలో ఎమోషన్స్ ను కూడా గొప్పగా పలికించి షాక్ ఇచ్చాడు. అలాంటి సూరి 'విడుదలై' సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా ఆయనకు భారీ హిట్ ను అందించింది. 

అప్పటి నుంచి సూరి కథానాయకుడిగా కథలు రాయడం మొదలైంది. అలా ఆయన హీరోగా రూపొందిన మరో సినిమానే 'మామన్'. ప్రశాంత్ పాండ్యరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది మే 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. చాలా తక్కవ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వైపు నుంచి ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది.

ఆగస్టు 8వ తేదీ నుంచి ఈ సినిమా 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. కథ విషయానికి వస్తే, ఇన్బా కి గిరిజ అనే చెల్లెలు ఉంటుంది. ఆమె అంటే అతనికి ప్రాణం. ఆమె కొడుకు 'లడ్డూ' అంటే ఎంతో ఇష్టం. మేనమామ దగ్గర 'లడ్డూ'కి ఎంతో చనువు ఉంటుంది. ఇన్బాకి ఫ్యామిలీ పట్ల గల ప్రేమను చూసే, రేఖ అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ఫ్యామిలీ పట్ల అతను చూపించే ఆ ప్రేమనే, పెళ్లి తరువాత రేఖకి మైనస్ గా అనిపిస్తుంది. ఫలితంగా ఏం జరుగుతుంది?  అనేదే మిగతా కథ. ఇతర ముఖ్యమైన పాత్రలలో ఐశ్వర్య లక్ష్మి .. స్వాసిక .. మాస్టర్ ప్రగీత్ కనిపిస్తారు.

Soori
Soori movie
Maman
Viduthalai
Tamil cinema
Prashanth Pandiyaraj
Aishwarya Lekshmi
Zee5
OTT release
Tamil movies

More Telugu News