Rishab Shetty: రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్రం.. స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Rishab Shetty Sitara Entertainments new movie announced
  • ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం 
  • ఒక స్పెష‌ల్ పోస్ట‌ర్‌ ద్వారా ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 
  • ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు  
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విష‌యాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సోష‌ల్ మీడియాలో తెలుపుతూ.. “అన్ని తిరుగుబాటులకు యుద్ధరంగమే ఆధారం కాదు. కొన్ని విధిచేత ఎంపిక చేయబడతాయి, ఇది ఒక తిరుగుబాటుదారుని కథ” అంటూ ఒక స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. 

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుండగా, ఫార్చ్యూన్ 4 సినిమాస్ శ్రీకర స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా, రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి పనిచేయడం, అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించడం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. 
Rishab Shetty
Sitara Entertainments
Ashwin Gangaraju
Kannada actor
Kantara movie
Sai Soujanya
Fortune 4 Cinemas
Sreekara Studios
Telugu cinema

More Telugu News