'కన్నప్ప' గురించి నేను మాట్లాడినదాంట్లో తప్పేమీ లేదే: తమ్మారెడ్డి భరద్వాజ్
- 'కన్నప్ప' సినిమాలో భక్తి ఎక్కడుంది?
- స్టార్స్ లేకపోయినా బాగానే ఆడేది
- మోహన్ బాబుగారు పట్టించుకుంటే బాగుండేది
- వాళ్లిద్దరికీ ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమేనన్న తమ్మారెడ్డి
" కన్నప్ప సినిమాను నేను 8వ రోజున చూశాను. ఆ సినిమాను గురించి 9వ రోజున ఇంటర్వ్యూలో మాట్లాడాను. అది పదో రోజున అంతా చూసి ఉంటారు. అంత గ్యాప్ తర్వాత మాట్లాడటం వలన నష్టం ఏముంటుంది? అయినా ఆ సినిమాను గురించి నేను నేరుగా మోహన్ బాబుగారితో .. మంచు విష్ణుతోనే మాట్లాడాను. స్టార్స్ ఎవరూ లేకపోయినా ఆ సినిమా ఆడి ఉండేదనీ, మీరే దాన్ని యావరేజ్ సినిమా చేశారని అన్నాను" అని చెప్పారు.
"మోహన్ బాబుగారికి డైరెక్షన్ పై కూడా మంచి పట్టు ఉంది. మీరు పట్టించుకుని ఉంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదని కూడా ఆయనతో అన్నాను. శివపార్వతులుగా వాళ్లిద్దరూ వెకిలిగా ఉన్నారు. శివుడే సరిగ్గా లేనప్పుడు భక్తి ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది. ఆయనకి బదులు అనామకుడిని పెట్టినా బాగుండేది. శివపార్వతులుగా వాళ్లకి ఇచ్చిన ప్రతి రూపాయి నష్టమే. మన వాళ్లకి కూడా మనం చెప్పకపోతే ఎట్లా? అందుకే చెప్పాను " అని అన్నారు.