జపాన్ లో సునామీ.. తీరానికి చేరిన భారీ తిమింగలాలు.. వీడియో ఇదిగో!
––
పసిఫిక్ తీరంలోని పలు దీవులను సునామీ అలలు ముంచెత్తాయి. టొకచాయ్ పోర్టులో 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడగా, హన్సంకిలో 30 సెంటీమీటర్లు, ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి. థోకు, కాంటో ప్రాంతాల్లోనూ భారీ అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లోని ఎయిర్ పోర్టుల్లో జపాన్ అలర్ట్ ప్రకటించింది. సెండాయ్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేసి విమానాలను దారిమళ్లించారు.