Justin Trudeau: మళ్లీ ప్రేమలో పడ్డ కెనడా మాజీ ప్రధాని.. అమెరికన్‌ సింగర్‌తో డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

Katy Perry and Justin Trudeau spark dating rumors after Montreal dinner outing
  • 2023లో తన భార్య సోఫీ గ్రెగోయ్‌రీతో విడాకులు తీసుకున్న జ‌స్టిన్ ట్రూడో
  • తాజాగా అమెరికాకు చెందిన గ్లోబల్‌ పాప్‌ స్టార్‌ కేటీ పెర్రీతో డేటింగ్‌
  • ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌
కెనడా మాజీ ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన ప్రేమలో పడినట్లు స‌మాచారం. అమెరికాకు చెందిన గ్లోబల్‌ పాప్‌ స్టార్‌ కేటీ పెర్రీతో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌కు వెళ్లిన వీడియో ఒకటి ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తన న్యూ ఆల్బమ్‌ ప్రమోషన్‌లో భాగంగా కేటీ పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రూడోతో కలిసి డిన్నర్‌ డేట్‌కు వెళ్లారు. మాంట్రియల్‌లోని హై ఎండ్‌ ఫ్రెంచ్‌ బిస్ట్రోలో ఇద్దరూ సన్నిహితంగా కనిపించారు. ఇద్దరూ రహస్యంగా విందుకు వెళ్లినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఓ ప్రైవేట్‌ కార్నర్‌ టేబుల్‌ వద్ద కేటీ పెర్రీ, ట్రూడో కూర్చొని రుచికరమైన వంటకాలను ఆస్వాదించారు. ఆ సమయంలో ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ సన్నిహితంగా కనిపించారు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది.

కాగా, జస్టిన్‌ ట్రూడో 2023లో తన భార్య సోఫీ గ్రెగోయ్‌రీతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చింకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. 2005 మే నెలలో జస్టిన్‌ ట్రుడో, సోఫీ గ్రెగోయ్‌రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Justin Trudeau
Justin Trudeau dating
Katy Perry
Justin Trudeau Katy Perry
Canada Prime Minister
celebrity dating
Sophie Gregoire
Canadian politics
pop star
divorce

More Telugu News