Prakash Raj: ఈడీ ఆఫీసుకు చేరుకున్న ప్రకాశ్ రాజ్

Prakash Raj at ED Office in Hyderabad for Questioning
––
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌ లో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసుకు సంబంధించి అధికారులు పంపించిన నోటీసులకు ఆయన స్పందించారు. ఇందులో భాగంగానే ఈ రోజు విచారణ కోసం అధికారుల ముందు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు.. మొత్తం 29 మందికి ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీలాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Prakash Raj
Enforcement Directorate
ED
Betting Apps
Money Laundering
Hyderabad
Tollywood
Celebrities
Social Media Influencers

More Telugu News