Russia Earthquake: రష్యాను కుదిపేసిన‌ భూకంపం.. కంపించిన భవనాలు.. వీడియోలు వైరల్‌!

Videos Show Moment 88 Magnitude Earthquake Struck Russias Kamchatka
  • రష్యాను వణికించిన భారీ భూకంపం 
  • రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 8.8గా న‌మోదు
  • భూకంపం కార‌ణంగా కంచట్కా, పెట్రోపావ్లోవ్‌స్క్‌ నగరాల్లో కంపించిన‌ భవనాలు 
  • నెట్టింట వైర‌ల‌వుతున్న వీడియోలు
రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభ‌వించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 8.8గా న‌మోదైంది. ప్ర‌పంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇదే మొద‌టిసారి అని విశ్లేష‌కులు అంటున్నారు. ఈ భూకంపం నేపథ్యంలో సంబంధిత అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కాసేపటికే రష్యా, జపాన్‌ను సునామీ తాకింది.

ఇక‌, భూకంపం కార‌ణంగా కంచట్కా, పెట్రోపావ్లోవ్‌స్క్‌ నగరాల్లోని పలు భవనాలు కంపించాయని రష్యా మీడియా వెల్ల‌డించింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది. విద్యుత్‌, సెల్‌ఫోన్‌ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు. 

రష్యాలోని కురిల్‌ దీవులు, జపాన్‌లోని ఉత్తర ద్వీపమైన హక్వైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. హోనోలులో సునామీ హెచ్చరిక సైరన్లు మోగడంతో భయాందోళనకు గురైన స్థానికులు నివాస ప్రాంతాలను వీడుతున్నారు. కాగా, ఈ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతున్నాయి.


Russia Earthquake
Russia
Earthquake
Kamchatka
Petropavlovsk
Tsunami warning
Kuril Islands
Hokkaido
Japan
Honolulu

More Telugu News