Dola Bala Veeranjaneya Swamy: గతంలో పెట్టుబడుల పేరుతో వైసీపీ నేతలు విదేశాల్లో విహార యాత్రలు చేశారు: మంత్రి స్వామి

Minister Swamy Criticizes YSRCP Leaders Foreign Trips
  • సింగపూర్ లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన
  • రాష్ట్రం కోసం చంద్రబాబు, లోకేశ్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్న మంత్రి స్వామి
  • చంద్రబాబు అపోలో టైర్స్ కంపెనీ తీసుకువచ్చారని వెల్లడి 
  • జగన్ ఐదేళ్లలో సైకిల్ ట్యూబ్ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా
ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ పర్యటనపై స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల పేరుతో వైసీపీ నేతలు విదేశాల్లో విహార యాత్రలు చేశారని స్వామి విమర్శించారు. ఫారెన్ ట్రిప్పుల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని అన్నారు. రాష్ట్రంలో విధ్వంస పాలన చేసి, సింగపూర్ తో ఏపీకి ఉన్న సత్సంబంధాలను దెబ్బతీశారని మండిపడ్డారు. 

ఇవాళ చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రానికి అపోలో టైర్స్ కంపెనీ తీసుకువచ్చారు... జగన్ తన ఐదేళ్లలో కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తెచ్చారా? అంటూ మంత్రి స్వామి దెప్పిపొడిచారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం... పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. 
Dola Bala Veeranjaneya Swamy
AP Minister
Andhra Pradesh
Chandrababu Naidu
Singapore tour
YS Jagan
YSRCP
Investments
Foreign tours
Apollo Tyres

More Telugu News