Rahul Gandhi: ఆ 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకరించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi to Sponsor 22 Orphaned Children from JK
  • ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు
  • తల్లిదండ్రులు, కుటుంబాలను కోల్పోయిన చిన్నారులు
  • ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటించిన రాహుల్ గాంధీ
  • అనాథలుగా మారిన చిన్నారుల జాబితా ఇవ్వాలని కాంగ్రెస్ నేతలకు ఆదేశం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద మనసు చాటుకున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతల కారణంగా అనాథలుగా మారిన 22 మంది చిన్నారుల ఆలన పాలన స్వీకరించేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. ఈ 22 మంది చిన్నారులు జమ్ము కశ్మీర్ లోని పూంఛ్ జిల్లాకు చెందినవారు. 

రాహుల్ గాంధీ ఇటీవల సరిహద్దు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా, పూంఛ్ ప్రాంతంలో తల్లిదండ్రులను, కుటుంబాలను కోల్పోయిన చిన్నారుల జాబితాను తనకు ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ హమీద్ 22 మంది చిన్నారులతో కూడిన జాబితాను రూపొందించి రాహుల్ గాంధీకి అందజేశారు.

ఇక ఆ చిన్నారుల బాధ్యతను రాహుల్ గాంధీయే చూసుకుంటారని, వారికి గ్రాడ్యుయేషన్ వరకు విద్య, వైద్యం, ఇతర ఖర్చులన్నీ రాహుల్ భరిస్తారని హమీద్ వివరించారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని చెప్పారు. 
Rahul Gandhi
Jammu Kashmir
Poonch district
Operation Sindoor
orphaned children
Congress leader
Hamid
children education
medical expenses

More Telugu News