China Floods: చైనాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం .. 34 మంది మృతి

China Floods Kill 34 in Beijing Heavy Rains
  • చైనా రాజధాని బీజింగ్‌లో భారీ వర్షాలు
  • పలు ప్రాంతాలు జలమయం 
  • విరిగిపడిన కొండచరియలు
  • నేలకూలిన భారీ చెట్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు
  • 80వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
చైనాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా బీజింగ్‌లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారని సమాచారం. దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

వరదల కారణంగా మియున్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఇక్కడ 28 మంది, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు మృతి చెందారు. హెబీ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురి ఆచూకీ గల్లంతైంది. లువాన్ పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కూడా కొండచరియలు విరిగిపడటంతో కొంతమంది ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. జనావాసాల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నదుల్లో వరద ఉధృతి అధికంగా ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటిమయంగా మారింది.

ఈ భారీ వర్షాలు, వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని చైనా ప్రధాన మంత్రి లి క్వియాంగ్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
China Floods
Beijing Floods
China heavy rains
Beijing heavy rains
China flood deaths
Beijing flood deaths
Li Keqiang
China disaster
China weather
Flooding

More Telugu News