మంత్రి లోకేశ్ సమక్షంలో టెజరాక్ట్, యూట్యూబ్ అకాడమీలతో ఎంఓయూ
- ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం
- సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం
- దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమన్న మంత్రి
ఈ ఒప్పందం ప్రకారం సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తుంది. పాఠ్యాంశాలు, శిక్షణా కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలను అందించనుండగా.. టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో విజయం సాధించేందుకు ఔత్సాహిక సృష్టికర్తలను సన్నద్దం చేయడం, వారికి అవసరమైన స్కిల్స్, నాలెడ్జి, వనరులు సమకూర్చడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడమే ఒప్పందం ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి లోకేశ్ అన్నారు.

