Chandrababu: సింగపూర్ పర్యటనలో 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం

CM Chandrababu meets industrialists on day 3 of Singapore tour
  • సింగపూర్ పర్యటనలో సీఎం చంద్ర‌బాబు బిజీ
  • ఈ రోజు ప‌దికి పైగా సమావేశాల్లో పాల్గొననున్న సీఎం
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
సీఎం చంద్ర‌బాబు సింగపూర్ పర్యటనలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇవాళ‌ 3వ రోజు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు చంద్ర‌బాబు ప‌దికి పైగా సమావేశాల్లో పాల్గొనున్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫిన్‌టెక్ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. 

క్యారియర్, విల్మర్, టీవీఎస్, మురాటా సంస్థల ప్రతినిధులతో చర్చలు జ‌రప‌నున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూట్యూబ్ అకాడమీతో ఒప్పందం చేసుకోనుంది. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగ రత్నం, మాజీ ప్రధాని లీ హ్సియన్ లూంగ్‌ల‌తో కూడా సీఎం చంద్ర‌బాబు  భేటీ కానున్నారు. 
 . 
అలాగే గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ ఆధారిత, క్లౌడ్ ఆధారిత సేవలు, డిజిటల్ ఇండియా లక్ష్యాలపై గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చ‌ర్చించ‌నున్నారు. మధ్యాహ్నం జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను సీఎం, మంత్రుల బృందం సందర్శించనుంది.
Chandrababu
Singapore tour
Andhra Pradesh
Industrialists meeting
IT sector
Electronics sector
Fintech companies
Google Cloud
Data centers
Green energy

More Telugu News