Kilaru Rosaiah: పొన్నూరు మాజీ ఎమ్మెల్యేకి సీఐడీ నోటీసులు

Former Ponnuru MLA Kilaru Rosaiah Receives CID Notice
  • పొన్నూరులో వైసీపీ హయాంలో బియ్యం వ్యాపారి బర్నబాసు దారుణ హత్య
  • నాడు వైసీపీ కీలక నేతల ఒత్తిడి మేరకు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయలేదని ఆరోపణలు
  • కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ
వైసీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పొన్నూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారి అంజి బర్నబాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో బర్నబాస్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

రేషన్ బియ్యం వ్యాపారంలో వైసీపీ నేతలతో ఆయనకు ఆర్థికపరమైన విభేదాలు తలెత్తాయని, ఆ కారణంగానే బర్నబాస్ హత్యకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ముఖ్య నాయకుల ఒత్తిడి మేరకు ప్రధాన సూత్రధారులను ఈ కేసులో అరెస్టు చేయలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

అనంతరం ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బర్నబాస్ కేసు విచారణలో భాగంగా అప్పటి ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు సీఐడీ నోటీసులు అందజేసింది. మంగళవారం సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. 
Kilaru Rosaiah
Kilaru Rosaiah CID
Ponnuru MLA
Anji Barnabas murder case
Andhra Pradesh CID
Ration rice scam
YSRCP leaders
Ponnuru
Andhra Pradesh politics

More Telugu News