Chevireddy Bhaskar Reddy: ఏపీ లిక్కర్ స్కాం... చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

Chevireddy Bhaskar Reddy Bail Petition Rejected in AP Liquor Scam Case
  • చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన ఏసీబీ కోర్టు
  • జూన్ 17న చెవిరెడ్డిని బెంగళూరులో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
  • 40 రోజులకుపైగా విజయవాడ జైలులో చెవిరెడ్డి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఏసీబీ కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. మద్యం కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

గత నెల 17వ తేదీన ఆయన బెంగళూరు నుంచి కొలంబోకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను కోర్టు ఆదేశాలతో విజయవాడలోని జిల్లా జైలుకు రిమాండ్ నిమిత్తం తరలించారు.

దాదాపు 40 రోజులకు పైగా ఆయన జైలులోనే ఉండగా, ఇదివరకే పలుమార్లు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో పరారీలో ఉన్న నిందితులపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. పరారీలో ఉన్న 12 మంది అరెస్టుకు వారెంట్ జారీ చేయాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం వారి అరెస్టుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో అవినాశ్ రెడ్డి, పురుషోత్తం, అనిరుధ్ రెడ్డి, షేక్ సైఫ్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బొల్లారం శివ, రాజీవ్ ప్రతాప్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. 
Chevireddy Bhaskar Reddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor Case
ACB Court Vijayawada
Non Bail Warrant
Liquor Mafia
YSRCP Leader
Avinash Reddy
AP Politics

More Telugu News