Sanjay Dutt: మహిళా అభిమాని ఇచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని తిరిగిచ్చిన సంజయ్ దత్!

Sanjay Dutt Returns Rs 72 Crore Property Gifted by Female Fan
  • సంజయ్ దత్ పేరిట ఆస్తిని రాసిన నిషా పటేల్
  • తన తదనంతరం హీరోకు దక్కాలన్న నిషా పటేల్
  • ఆస్తిని ఆమె కుటుంబానికే ఇచ్చినట్లు ఇంటర్వ్యూలో వెల్లడించిన సంజయ్ దత్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన అభిమాని ఒకరు ఇచ్చిన రూ. 72 కోట్ల ఆస్తిని తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తనకు గతంలో ఒక అభిమాని ఇచ్చిన పదుల కోట్ల ఆస్తిని వారి కుటుంబానికి తిరిగి ఇచ్చానని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది ఏడేళ్ల క్రితం జరిగింది.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న నిషా పటేల్ అనే అభిమాని అప్పట్లో తన ఎస్టేట్ మొత్తాన్ని సంజయ్ దత్ పేరు మీద రాశారు. ఆమె మరణించిన తర్వాత తన సంపద సంజయ్ దత్‌కు దక్కేలా వీలునామా రాశారు. సంజయ్ దత్‌కు అందేలా చూడాలని బ్యాంకులకు కూడా ఆమె సూచించినట్లు వార్తలు వచ్చాయి.

ఈ విషయంపై సంజయ్ దత్ మాట్లాడుతూ, ఆ ఆస్తిని ఆమె కుటుంబ సభ్యులకే ఇచ్చేశానని ఇంటర్వ్యూలో చెప్పారు. 


Sanjay Dutt
Sanjay Dutt property
Nisha Patel
Bollywood actor
Akhanda 2

More Telugu News