TSRTC: హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ 'భారీ' శుభవార్త

TSRTC Announces Huge Discount for Hyderabad Vijayawada Bus Passengers
  • ఆయా బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ
  • 16 శాతం నుంచి 30 శాతం వరకు ధరల తగ్గింపు
  • గరుడ ప్లస్ బస్సుల్లో అత్యధికంగా 30 శాతం తగ్గింపు
  • రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16 శాతం మేర తగ్గింపు
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రయాణించే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ శుభవార్తను ప్రకటించింది. ఈ మార్గంలోని బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. ఛార్జీలను 16 శాతం నుండి గరిష్ఠంగా 30 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ రాయితీలు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ బుకింగ్‌లకు వర్తిస్తాయని పేర్కొంది.

'హైదరాబాద్-విజయవాడ మార్గంలో టిక్కెట్లపై భారీ తగ్గింపు' అంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. గరుడ ప్లస్ బస్సుల్లో టిక్కెట్ ధరపై 30 శాతం, ఈ-గరుడ బస్సుల్లో 26 శాతం ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. సూపర్ లగ్జరీ, లహరి నాన్ ఏసీ బస్సుల్లో టిక్కెట్లపై 20 శాతం, రాజధాని, లహరి ఏసీ బస్సుల్లో 16 శాతం వరకు తగ్గింపు ఉంటుందని వెల్లడించింది.

TSRTC
Telangana RTC
Hyderabad Vijayawada
bus fares reduced
Garuda Plus buses

More Telugu News