Harish Rao: రూ. కోటి పరిహారం ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు కానీ: హరీశ్ రావు ఆగ్రహం

Harish Rao demands compensation for Sigachi victims
  • సిగాచీ పరిశ్రమ ప్రమాద బాధితులకు పరిహార అందలేదన్న హరీశ్ రావు
  • బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని అదనపు కలెక్టర్‌ను కలిసిన హరీశ్ రావు
  • పరిహారం అందకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారన్న మాజీ మంత్రి
సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందేలా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ రోజులు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సిగాచీ బాధిత కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిగాచీ ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆయన సంగారెడ్డి అదనపు కలెక్టర్‌ను కలిశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, పరిహారం అందలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పరిహారం ఎప్పుడు ఇస్తారని వారు నిలదీస్తున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. పరిహారం కోసం అధికారులను కలిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆరోపించారు. కొన్ని కుటుంబాలకు లక్ష రూపాయలు మాత్రమే పరిహారం అందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇంకా ప్రకటించలేదని విమర్శించారు. ఎంతమందికి పరిహారం ఇచ్చారో అధికారికంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
Harish Rao
Revanth Reddy
Sigachi Industries
Sangareddy
Telangana government

More Telugu News