Kamal: గబ్బిలాల మాంసాన్ని చికెన్‌గా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Bat Meat Sold as Chicken Two Arrested
  • తమిళనాడులోని సేలం జిల్లాలో ఘటన
  • గబ్బిలాల మాంసాన్ని వండి చికెన్‌గా విక్రయిస్తున్న వైనం
  • థోప్పూర్ రామస్వామి అటవీ పరిధిలో వేటగాళ్లను అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు
తమిళనాడులోని సేలం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఒమలూర్ సమీపంలోని డానిష్‌పేట్టై వద్ద గబ్బిలాలను వేటాడి, వాటిని వండి, ఆ మాంసాన్ని చికెన్‌గా విక్రయిస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అటవీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కమల్, సెల్వంగా గుర్తించారు. తోప్పూర్ రామస్వామి అటవీ పరిధిలో పలుమార్లు గన్‌షాట్‌ల శబ్దాలు వినిపించినట్టు అటవీ అధికారులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా ఫారెస్ట్ రేంజర్ విమల్ కుమార్ నేతృత్వంలోని ఒక బృందం తనిఖీ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఇద్దరు వ్యక్తులు అటవీ ప్రాంతంలో ఫ్రూట్ బ్యాట్‌ల (పండ్లు తినే గబ్బిలాలు)ను వేటాడి, వాటిని వండి, చికెన్ మాంసంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

ఫ్రూట్ బ్యాట్‌ల సంరక్షణ, గత ఘటనలు
ఫ్రూట్ బ్యాట్‌లు భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్-II జాతిగా రక్షణ పొందుతున్నాయి. వీటిని వేటాడటం లేదా అమ్మడం పూర్తిగా చట్టవిరుద్ధం. ఈ నేరానికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.

2021లో తుమకూరు జిల్లాలో 25 ఫ్రూట్ బ్యాట్‌ల కళేబరాలను రవాణా చేస్తుండగా అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కూడా వాటిని మాంసం కోసం బెంగళూరు, తుమకూరులో అమ్మేందుకు రవాణా చేస్తున్నారని తెలిసింది. ఫ్రూట్ బ్యాట్‌ల వేట వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరెస్టయిన కమల్, సెల్వంపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 9, 39 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేరాలకు గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు. 
Kamal
Kamal arrest
Selvam
Selvam arrest
Tamil Nadu
fruit bats
bat meat
wildlife protection act 1972
forest officials
illegal hunting

More Telugu News