Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ కు గుడ్ బై చెబుతున్నాడా? క్లారిటీ ఇదిగో!

Nitish Kumar Reddy Denies Leaving Sunrisers Hyderabad SRH
  • నితీశ్ సన్ రైజర్స్ ను వదిలేస్తున్నాడంటూ వార్తలు
  • 2026 సీజన్ కు ముందు జట్టు మారతాడంటూ ప్రచారం
  • వాటిల్లో నిజం లేదన్న నితీశ్ కుమార్ రెడ్డి
  • తాను ఎప్పటికీ ఎస్ఆర్ హెచ్ కు అండగా ఉంటానని వెల్లడి
స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) ఫ్రాంచైజీని వీడుతున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. 2026 ఐపీఎల్ సీజన్‌కు ముందు అతను ఎస్ఆర్ హెచ్ కు గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయని కొన్ని మీడియా నివేదికలు పేర్కొనగా, నితీశ్ కుమార్ రెడ్డి ఈ ఊహాగానాలను ఖండించాడు. దీనిపై అతడు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. తాను జట్టును వీడుతున్నానే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని అభిమానులకు సూచించాడు.

ఈ మేరకు నితీశ్ కుమార్ రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. "నేను గందరగోళానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను, కానీ కొన్ని విషయాలకు స్పష్టత అవసరం. ఎస్ఆర్ హెచ్ జట్టుతో నా అనుబంధం నమ్మకం, గౌరవం మరియు సంవత్సరాల భాగస్వామ్య అభిరుచిపై నిర్మితమైంది. నేను ఎల్లప్పుడూ ఈ జట్టుకు అండగా ఉంటాను" అని స్పష్టం చేశాడు.

నితీశ్ రెడ్డి ఐపీఎల్-2024 సీజన్‌లో ఎస్ఆర్ హెచ్ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచి 303 పరుగులు చేశాడు. అయితే, 2025 సీజన్‌లో గాయం కారణంగా అతని ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. కేవలం 182 పరుగులు మాత్రమే చేశాడు. జట్టులో తన పాత్రపై అసంతృప్తిగా ఉన్నాడనే నివేదికలు కూడా వెలువడ్డాయి, ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందికి పంపడం నితీశ్ కు నచ్చలేదని ప్రచారం జరిగింది.

కాగా, నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో మోకాలి గాయం కారణంగా అతను టెస్ట్ సిరీస్ నుండి వైదొలిగాడు. దానికి తోడు ఓ న్యాయపరమైన వివాదం కూడా చుట్టుముట్టింది. టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'స్క్వేర్ ది వన్' ఐదు కోట్ల రూపాయల బకాయిల కోసం నితీశ్ కుమార్ రెడ్డిపై కేసు వేయడంతో అతను న్యాయపరమైన చిక్కులను కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ కేసు సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది.

 

Nitish Kumar Reddy
Nitish Reddy
Sunrisers Hyderabad
SRH
IPL
IPL 2024
IPL 2025
Indian Premier League
Cricket
SRH Squad

More Telugu News