KTR: బీఆర్ఎస్ విలీనం కోసం ప్రయత్నించారంటూ సీఎం రమేశ్ ఆరోపణ.. స్పందించిన కేటీఆర్

KTR Responds to CM Ramesh Allegations on BRS Merger
  • తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్న కేటీఆర్
  • విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
  • ఇది పసలేని వాదన అంటూ వ్యాఖ్యాలు
తెలంగాణ ఉన్నంతవరకు బీఆర్ఎస్ ఉంటుందని, తమ పార్టీని మరే ఇతర పార్టీలోనూ విలీనం చేసే ప్రశ్నే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలకు కేటీఆర్ పై విధంగా స్పందించారు. బీఆర్ఎస్ విలీనం అనే అంశం పసలేని వాదన అని కొట్టిపారేశారు. 

రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతిసారీ బీజేపీ, కాంగ్రెస్ లు ఈ విలీనం అంశాన్ని తీసుకువస్తుంటాయని విమర్శించారు. స్కాంల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు విలీనం అంశం తెరపైకి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేశ్ ఇద్దరూ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. 
KTR
BRS
Telangana
CM Ramesh
Revanth Reddy
BJP
Congress
BRS Merger
Telangana Politics

More Telugu News