Visakhapatnam: వైజాగ్ లో కావడి యాత్ర.. వేలాదిగా పాల్గొన్న మార్వాడీలు
శ్రావణమాసం సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం కావడి యాత్ర ఘనంగా జరిగింది. నగరంలోని మార్వాడీలు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. మాధవధార వద్ద ప్రారంభమైన కావడియాత్రలో సుమారు వెయ్యి మందికి పైగా మార్వాడీలు పాల్గొన్నారు. స్థానిక మార్వాడీ కుటుంబాలకు చెందిన చిన్నాపెద్దా మొత్తం కలిసి నడిచారు. కాషాయ దుస్తులతో మహిళలు కూడాపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కావడి యాత్ర మాధవధార, కంచరపాలెం, తాడిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం మీదుగా బీచ్ రోడ్డుకు చేరింది. ప్రకృతి పట్ల విశ్వాసం, కృతజ్ఞత తెలపడమే కాకుండా బలమైన కుటుంబ విలువలను పెంపొందించుకోవడమే ఈ యాత్ర లక్ష్యమని యాత్రలో పాల్గొన్న భక్తులు తెలిపారు.