Mithun Reddy: జైలులో మిథున్ రెడ్డితో అర్ధాంగి, కుమారుడు ములాఖత్

Mithun Reddy Wife and Son Meet Him in Jail
  • లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
  • మిథున్ రెడ్డితో జైలులో ములాఖత్ అయిన అర్ధాంగి లక్ష్మీ, కుమారుడు జస్విన్ రెడ్డి
  • జైలు వద్ద మిథున్ రెడ్డి అర్ధాంగి, కుమారుడితో మాట్లాడిన వైసీపీ మాజీ ఎంపీ భరత్ రామ్
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన అర్ధాంగి లక్ష్మీ, కుమారుడు జస్విన్ రెడ్డి నిన్న జైలులో కలుసుకున్నారు.

మాజీ ఎంపీ భరత్ రామ్ జైలు వద్ద వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ, మిథున్ రెడ్డిని కక్షపూరితంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. జగన్ హయాంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.7 వేల కోట్ల ఆదాయం పెరిగితే నష్టం ఎక్కడ వాటిల్లిందని ఆయన ప్రశ్నించారు. 
Mithun Reddy
Peddireddy Mithun Reddy
AP Liquor Scam
YSRCP
Rajahmundry Central Jail
Bharat Ram
Andhra Pradesh Politics
Liquor Policy
Jagan Mohan Reddy

More Telugu News