YS Jaganmohan Reddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: భారతి సిమెంట్స్ కార్యాలయంలో సిట్ సోదాలు

YS Jaganmohan Reddy Familys Bharathi Cements Office Searched in AP Liquor Scam
  • భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఛాంబర్, నివాసంలోనూ సోదాలు నిర్వహించిన సిట్
  • పలు పత్రాలు, సీసీ టీవీ పుటేజీ స్వాధీనం
  • నిందితులు రాజ్ కెసిరెడ్డి, చాణక్యలకు సంబంధించిన వ్యక్తుల నివాసాల్లోనూ తనిఖీలు చేసిన సిట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబానికి చెందిన హైదరాబాద్‌లోని భారతి సిమెంట్స్ కార్యాలయంలో నిన్న సిట్ సోదాలు నిర్వహించింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తి కాలపు డైరెక్టర్, లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడైన గోవిందప్ప బాలాజీ ఛాంబర్‌లోనూ, బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలోనూ సిట్ అధికారులు సోదాలు జరిపి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

కార్యాలయంలోని గోవిందప్ప ఛాంబర్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలానే రాజ్ కెసిరెడ్డి అర్ధాంగి సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శినిరెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాత రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంలో, మరో నిందితుడు చాణక్య యజమానిగా ఉన్న టీ గ్రిల్స్ రెస్టారెంట్ కార్యాలయంలో కూడా సిట్ అధికారులు సోదాలు జరిపారు.

లిక్కర్ స్కామ్ కేసులో గోవిందప్ప బాలాజీ.. వైఎస్ జగన్మోహనరెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్‌కు పూర్తి కాలపు డైరెక్టర్‌గా ఉండటంతో ఆ సంస్థ కార్యాలయంలోనూ సిట్ బృందం సోదాలు జరపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 
YS Jaganmohan Reddy
AP Liquor Scam
Bharathi Cements
Govindappa Balaji
SIT Investigation
Resource One IT Solutions
T Grills Restaurant
Andhra Pradesh

More Telugu News