Vijay Deverakonda: తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య‌శ్రీ బోర్సే

Vijay Deverakonda and Bhagyashri Borse visit Tirumala
    
హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, హీరోయిన్ భాగ్య‌శ్రీ బోర్సేతో పాటు 'కింగ్డమ్' చిత్ర బృందం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఈ ఉద‌యం నైవేద్య విరామ స‌మ‌యంలో స్వామివారి సేవ‌లో పాల్గొన్నారు. ద‌ర్శ‌నానంత‌రం వీరికి ఆల‌య రంగ‌నాయ‌కుల మండ‌పంలో పండితులు వేద ఆశీర్వ‌చ‌నం చేశారు. ఆపై టీటీడీ అధికారులు వారికి తీర్థ‌ప్ర‌సాదాలను అంద‌జేశారు. 

కాగా, నిన్న రాత్రి తిరుప‌తిలో 'కింగ్డమ్' మూవీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈవెంట్‌లో సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. గౌతమ్ తిన్ననూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో క‌థానాయిక‌గా భాగ్యశ్రీ న‌టిస్తుండ‌గా... సత్యదేవ్ మ‌రో ముఖ్య పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఈ నెల‌ 31న మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.
Vijay Deverakonda
Kingdom movie
Bhagyashri Borse
Tirumala temple
Gautham Tinnanuri
Sithara Entertainments
Fortune Four Cinemas
Telugu movies
Satyadev

More Telugu News