Chandrababu: సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందం.. తొలిరోజు పర్యటన ఇలా!

Chandrababu Naidu Singapore tour begins with diaspora meet
  • చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం
  • సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు, మహిళలు
  • కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు
సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తెలుగు కుటుంబాలు, మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలక‌డం విశేషం. అటు చిన్నారులు కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికారు.  

సీఎం రాక సందర్భంగా హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి క‌నిపించింది. ఇక‌, ఐదు రోజుల పర్యటనలో భాగంగా చంద్ర‌బాబు 29 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు. 

సీఎం చంద్రబాబు సింగపూర్ తొలిరోజు పర్యటన ఇలా..

  • ఉదయం 11:00 నుంచి 11:30 గంటల వరకు భారత హైకమిషనర్  శిల్పక్ అంబులేతో షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో సమావేశం కానున్న సీఎం
  • ఉదయం 11:30 నుంచి 12:00 గంటల వరకు సుర్భా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్ ఎక్‌లో, రిక్ యియో, జిగ్నేష్ పట్టానీలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి
  • మధ్యాహ్నం 12:00 నుంచి 12:30 గంటలకు ఎవర్‌సెండాయ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ తన్ శ్రీ డాటో ఏ.కె. నాథన్ తో పెట్టుబడులపై చర్చించనున్న ముఖ్యమంత్రి
  • మధ్యాహ్నం 2:00 నుంచి 6:30 గంటల వరకు OWIS ఆడిటోరియంలో జరిగే తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
  • సాయంత్రం 7:00 నుంచి 9:00 గంటల మధ్య భారత హైకమిషనర్ నివాసంలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, డయాస్పోరా నేతలతో  విందు సమావేశంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు.


Chandrababu
Singapore tour
AP CM Singapore
Telugu diaspora Singapore
Singapore investments
Andhra Pradesh investments
Singapore government
NRI Singapore
South East Asia Telugu
Shilpak Ambule

More Telugu News