Ishaq Dar: భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం... కానీ!: పాకిస్థాన్ ఉప ప్రధాని కీలక వ్యాఖ్యలు

Ishaq Dar Pakistan ready to work with India
  • చర్చల విషయంలో న్యూఢిల్లీదే తుది నిర్ణయమన్న పాకిస్థాన్
  • చర్చల అంశంలో భారత్ అధికారిక స్పందన కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడి
  • గతంలోని విధివిధానాల ఆధారంగా చర్చలు ఉండాలని నిబంధనలు
భారత్‌తో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని, చర్చల విషయంలో న్యూఢిల్లీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు. చర్చల విషయంలో భారత్ అధికారిక స్పందన కోసం తాము ఎదురు చూస్తున్నామని ఆయన వెల్లడించారు. వాణిజ్యం, ఆర్థిక సహకారం, ఉగ్రవాదంపై పోరాటం వంటి ప్రతి అంశంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

అయితే, చర్చలు అర్థవంతంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశం, సరిహద్దు భద్రత, ఆర్థిక సంబంధాల్లో ఉన్న ఆందోళనలపై గతంలోని విధివిధానాల ఆధారంగానే చర్చలు జరగాలని ఆయన షరతులు విధించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గతంలో మాట్లాడుతూ, చర్చలకు సిద్ధమని తెలిపారు. అదే సమయంలో కశ్మీర్, ఉగ్రవాదం, వాణిజ్యం, జల వివాదం సహా అన్ని సమస్యలపై ఇరు దేశాలు చర్చించాలని ఆయన షరతు విధించారు.
Ishaq Dar
Pakistan
India
India Pakistan relations
Kashmir issue
terrorism
trade

More Telugu News