Revanth Reddy: ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త!

Revanth Reddy signs off on Telangana teachers promotions
  • ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా
  • దస్త్రంపై సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • త్వరలో ఎస్జీటీలీ, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు
ఉపాధ్యాయ లోకానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. దీనితో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు త్వరలో పదోన్నతులు లభించనున్నాయి. రానున్న రెండు రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన పలువురు ఉపాధ్యాయులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్లు గెజిటెడ్ హెడ్‌మాస్టరుగా పదోన్నతి పొందనున్నారు. పదవీ విరమణల కారణంగా దాదాపు 750 గెజిటెడ్ హెచ్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. తద్వారా ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేస్తారు. 
Revanth Reddy
Telangana teachers
Teachers promotions
Telangana government
SGT teachers

More Telugu News