Rajasthan CMO: మరో రెండు గంటల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయి: రాజస్థాన్ సీఎంవో, జైపూర్ విమానాశ్రయానికి బెదిరింపు

Bomb Threat to Rajasthan CMO and Jaipur Airport
  • ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్లు తెలిపిన అధికారులు
  • సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్న దుండగులు
  • తనిఖీలు నిర్వహించి రెండు చోట్లా అనుమానాస్పద వస్తువులు లేవని తేల్చిన అధికారులు
రాజస్థాన్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చినట్లు వారు పేర్కొన్నారు.

గంట లేదా రెండు గంటల్లో ముఖ్యమంత్రి కార్యాలయం, విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు సంభవిస్తాయని, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ ఆ మెయిల్స్‌లో దుండగులు హెచ్చరించారు.

బాంబు బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం, విమానాశ్రయంలో యాంటీ బాంబు స్క్వాడ్, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, రెండు చోట్ల ఎలాంటి అనుమానాస్పద వస్తువుల లభ్యం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Rajasthan CMO
Rajasthan
Jaipur Airport
Bomb threat
Email threat
Security alert
Bomb squad
Jaipur

More Telugu News