Revanth Reddy: రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు.. పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం

Congress leader furious over Padi Kaushik Reddys comments on Revanth Reddy
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి ఆగ్రహం
  • కౌశిక్ రెడ్డి ఏమ మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని మండిపాటు
  • రోజుకు పద్దెనిమిది గంటలు తమ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, ఆయనకు మతి భ్రమించిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.

రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తోన్న ప్రభుత్వం తమదని అన్నారు. కౌశిక్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోకపోతే సన్నబియ్యం తినే ప్రజలే ఆయనను కొడతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉచిత బస్సు ఎక్కే మహిళలు ఊరుకోరని ఆయన అన్నారు.

ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వారి ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ పాపం కేటీఆర్‌దేనని ఆరోపించారు. మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసని అన్నారు.
Revanth Reddy
Padi Kaushik Reddy
Shiva Sena Reddy
Telangana politics
BRS MLC

More Telugu News