Sam Altman: చాట్ జీపీటీపై ఆల్ట్ మన్ సంచలన వ్యాఖ్యలు

Sam Altman warns ChatGPT user data is not private
  • యూజర్లు పంచుకునే సీక్రెట్లు దాచబోమని వెల్లడి
  • అవసరమైతే బయటకు చెప్పేస్తుందన్న సీఈవో
  • డిలీట్ చేసిన 30 రోజుల తర్వాత శాశ్వతంగా తొలగిస్తామని వివరణ
చాట్ జీపీటీపై ఆ కంపెనీ సీఈవో శామ్ ఆల్ట్ మన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చాట్ జీపీటీ అంత నమ్మదగిన టెక్నాలజీ కాదని వ్యాఖ్యానించి చర్చకు తెరలేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూజర్లు చాట్ జీపీటీతో పంచుకునే విషయాలు రహస్యంగా ఉండవంటూ ఆల్ట్ మన్ బాంబు పేల్చారు.

అవసరమైన సందర్భంలో బయటకు వెల్లడిస్తామని, ముఖ్యంగా న్యాయపరమైన అంశాలలో రహస్యాలను కాపడలేమని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి యూజర్లకు సంబంధించిన డేటాలోని ఏ విషయాన్నైనా వెల్లడిస్తామని తేల్చిచెప్పారు. చాట్ జీపీటీలో డిలీట్ చేసిన సందేశాలు, చిత్రాలకు సంబంధించిన అంశంలో.. న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమైతే వాటిని భద్రపరుస్తామని, లేదంటే 30 రోజుల తర్వాత వాటిని శాశ్వతంగా తొలగిస్తామని ఆల్ట్ మన్ వివరించారు.
Sam Altman
ChatGPT
OpenAI
Data privacy
User data
Legal issues
Court orders
Data security
AI technology
Chatbots

More Telugu News