Ashok Gajapathi Raju: గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు.. ప్రమాణ స్వీకారం వీడియో ఇదిగో!

Ashok Gajapathi Raju sworn in as Goa Governor
––
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు,  పలువురు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్‌, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

Ashok Gajapathi Raju
Goa Governor
Pramod Sawant
Goa
Ram Mohan Naidu
Andhra Pradesh
Nara Lokesh
TDP Leaders

More Telugu News