Yuzvendra Chahal: ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై చాహల్‌ను ఆటపట్టించిన రిషభ్‌ పంత్

Rishabh Pant Teases Chahal About Dating RJ Mahvash
  • 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సెట్‌లో బాలీవుడ్ నటి అర్చనా పూరణ్ సింగ్ వ్లాగింగ్ టీం
  • సందడి చేసిన పంత్, చాహల్, అభిషేక్ శర్మ, గంభీర్
  • సరదా సంభాషణలతో ఉత్సాహంగా సాగిన షో
'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో' సెట్‌లో బాలీవుడ్ నటి అర్చనా పూరణ్ సింగ్ తన వ్లాగింగ్ బృందంతో కలిసి బ్యాక్‌స్టేజ్ క్షణాలను అభిమానులతో పంచుకుంది. క్రికెటర్లు రిషభ్ పంత్, యుజ్వేంద్ర చాహల్, అభిషేక్ శర్మ, గౌతం గంభీర్‌లతో కూడిన ప్రత్యేక ఎపిసోడ్‌కు సంబంధించిన ఈ వ్లాగ్‌లో షోలోని ఫన్నీ మూమెంట్స్‌తో పాటు క్రికెటర్లతో అర్చనా సరదా సంభాషణలు హైలైట్‌గా నిలిచాయి.

వ్లాగ్‌లో అర్చన తనకు గొంతు నొప్పిగా ఉన్నప్పటికీ కెమెరా ముందు ఎలా నవ్వగలనో సరదాగా చెప్పింది. బ్యాక్‌స్టేజ్‌లో కపిల్ శర్మను కలిసిన ఆమె.. అతడి నలుపు-తెలుపు సూట్‌ను చూసి "అద్భుతంగా ఉంది, ఎక్కడ తీసుకున్నావు?" అని ప్రశంసించింది. షూటింగ్ తర్వాత వేరే చోటికి వెళ్లాలని కపిల్ సమాధానమిచ్చాడు.

షోలో నవ్‌జోత్ సింగ్ సిద్ధూ ఎంట్రీ ఇస్తూ యువ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి మాట్లాడాడు. "అతడు భారత క్రికెట్ భవిష్యత్తు. అతడంటే చాలా గర్వంగా ఉంది" అని ప్రశంసించాడు. అర్చన కూడా అభిషేక్‌ను స్వాగతిస్తూ "అతడు చాలా అందమైన అబ్బాయి, కపిల్‌లానే అమృత్‌సర్ నుంచి వచ్చాడు" అని చెప్పింది.

రిషభ్ పంత్, చాహల్‌తో ఫన్నీ బాంటర్
రిషభ్ పంత్‌ను అర్చన అతడి కారు ప్రమాదం గురించి అడిగింది. దానికి పంత్ "ఆ ప్రమాదం నాకు జీవితంపై కొత్త దృక్పథాన్ని ఇచ్చింది, చాలా నేర్పింది" అని సమాధానమిచ్చాడు. తాను యూట్యూబ్ చానల్ ప్రారంభించానని పంత్ వెల్లడించగా, అర్చన అతనికి షౌట్‌అవుట్ ఇచ్చింది.

చాహల్‌తో సరదా సంభాషణ వ్లాగ్‌కు హైలైట్‌గా నిలిచింది. చాహల్ చేతికి ఒక రింగ్ పెడుతూ రిషభ్ పంత్  ఆటపట్టించగా.. అర్చన జోక్ చేస్తూ "మీరిప్పుడు అతడితో నిశ్చితార్థం చేసుకున్నారా?" అని అడిగింది. దానికి రిషభ్ "ఇతనిది ఇప్పటికే అయిపోయింది" అని చాహల్‌ గత నిశ్చితార్థం గురించి సరదాగా చెప్పాడు. చాహల్ వెంటనే స్పందిస్తూ "ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది" అని తను ధనశ్రీ వర్మతో విడిపోయిన విషయాన్ని సూచించాడు. (చాహల్ - ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు)

చాహల్‌ను అర్చన తన మద్ ఐలాండ్ ఇంటికి ఆహ్వానించగా, అతడు ముంబైకి రావడానికి సమయం దొరకదని సరదాగా చెప్పారు. రిషభ్ వెంటనే "ఇతను ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు" అని ఆటపట్టించాడు. చాహల్ "అందరికీ చెప్పేయ్" అని సమాధానమిచ్చాడు. రిషభ్ బిగ్గరగా అరుస్తూ చాహల్‌ను ముంబైలోని ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్ రూమర్స్ గురించి ఆటపట్టించాడు.

యుజ్వేంద్ర చాహల్-ఆర్జే మహ్వాష్ గత ఏడాది నుంచి వార్తల్లో నిలుస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో మహ్వాష్ చాహల్‌కు మద్దతుగా కనిపించడం, ఇద్దరూ డిన్నర్లు, హాలిడేస్‌లో కలిసి ఉండటం వంటివి వారి డేటింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోశాయి. ఇటీవల ఒక యాడ్‌లో కలిసి కనిపించడం ఈ ఊహాగానాలను మరింత బలపరిచింది. 
Yuzvendra Chahal
Rishabh Pant
The Great Indian Kapil Show
RJ Mahvash
Dhanashree Verma
Cricket
Archana Puran Singh
Kapil Sharma
Dating rumors
Divorce

More Telugu News