అలిపిరి వద్ద బైకర్ పై చిరుత దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో ఇదిగో!
––
అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు సమీపంలో ఇటీవల చిరుతపులుల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఈ మార్గంలో అధికారులు గస్తీ పెంచారు. తాజాగా అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు వద్ద ఓ చిరుత రోడ్డు పక్కనే నక్కి.. బైక్ పై వెళుతున్న వారిపై దాడికి యత్నించింది. బైక్ వేగంగా వెళుతుండడంతో వారు చిరుతకు చిక్కలేదు. చిరుత పట్టు తప్పి రోడ్డుపై పడిపోయింది. బైక్ వెనకాలే ప్రయాణిస్తున్న కారు డ్యాష్ కెమెరాలో ఈ ఘటన మొత్తం రికార్డైంది. ఈ సంఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు రాత్రిపూట ఘాట్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించడం లేదు.