Nandamuri Balakrishna: అభిమాని చికిత్సకు బాలయ్య చొరవ .. ఏకంగా రూ.10 లక్షల మంజూరు

Balakrishna Arranges 10 Lakhs in Aid for Fans Medical Treatment
  • అనారోగ్యంతో బాధపడుతున్న బాలయ్య అభిమాని బద్రిస్వామి
  • అతని పరిస్థితిని బాలయ్య దృష్టికి తీసుకువెళ్లిన అభిమాన సంఘ నేత
  • ప్రభుత్వం ద్వారా చికిత్సకు రూ.10లక్షల ఎల్ఓసీ ఇప్పించిన బాలయ్య
  • బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేసిన బాలయ్య సతీమణి వసుంధర
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలుసుకుని, ప్రత్యేక చొరవతో చికిత్స నిమిత్తం ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున సాయం అందేలా చర్యలు తీసుకున్నారు.

కర్నూలు జిల్లా, ఆదోని పట్టణానికి చెందిన అభిమాని బద్రిస్వామి కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేని అతని పరిస్థితిని పట్టణ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు.

దీంతో స్పందించిన బాలయ్య, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.10 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. సంబంధిత పత్రాన్ని బాలయ్య అర్ధాంగి వసుంధర నిన్న బాధిత కుటుంబానికి అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచి సాయం అందేలా చొరవ చూపిన బాలయ్యకు ఈ సందర్భంగా అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. 
Nandamuri Balakrishna
Balakrishna
Hindupuram MLA
Badri Swamy
Liver Disease
Andhra Pradesh Government
Medical Treatment
Kurnool District
Adoni
Vasundhara

More Telugu News