Periyakaruppu Temple: వింత ఆచారం.. పూజారికి కారం నీళ్ల‌తో అభిషేకం.. ఎక్క‌డంటే..!

Periyakaruppu Temple priest showered with spicy water in Tamil Nadu
  • త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పూరి జిల్లాలోని పెరియ‌క‌రుప్పు ఆల‌యంలో వింత ఆచారం
  • యేటా ఆడి అమావాస్య సంద‌ర్భంగా ఆలయ‌ పూజారికి కారం నీళ్ల‌తో అభిషేకం
  • ఈసారి 108 కిలోల కారం, 6 కిలోల ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు క‌లిపిన నీళ్ల‌తో అభిషేకం
త‌మిళ‌నాడులోని ధ‌ర్మ‌పూరి జిల్లాలో ఓ వింత ఆచారం కొన‌సాగుతోంది. పూజారికి కారం నీళ్ల‌తో అభిషేకం చేయ‌డం. అవును.. మీరు విన్న‌ది నిజ‌మే. అక్క‌డి పెరియ‌క‌రుప్పు ఆల‌యంలో ఈ ఆచారం ఉంది. యేటా ఆడి అమావాస్య సంద‌ర్భంగా ఆలయ‌ పూజారికి ఇలా కారం, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు క‌లిపిన‌  నీళ్ల‌తో అభిషేకించ‌డం జ‌రుగుతుంది.

గురువారం ఆడి అమావాస్య రావ‌డంతో 108 కిలోల కారం, ఆరు కిలోల ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు క‌లిపిన నీళ్ల‌తో పూజారి గోవింద్‌కు అభిషేకం చేశారు. ఈ ప్ర‌త్యేక అభిషేకంలో పెద్ద సంఖ్య‌లో పాల్గొన్న భ‌క్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే భ‌క్తుల‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో మాంసాహార విందు ఏర్పాటు చేశారు.  


Periyakaruppu Temple
Tamil Nadu
Dharmapuri
Spicy Water Abhishekam
ஆடி அமாவாசை
Adi Amavasya
Govind priest
Indian customs
unique rituals
Periyakaruppu Temple festival

More Telugu News