Andy Byran: హెచ్‌ఆర్‌తో సన్నిహితంగా మెలిగిన ఐటీ కంపెనీ సీఈవో.. ఇద్దరూ రాజీనామా

Andy Byran IT Company CEO Resigns After Intimacy with HR
  • కోల్డ్ ప్లే కచేరీలో కౌగిలించుకొని కచేరీ ఆస్వాదించిన సీఈవో, హెచ్ఆర్
  • ఫోకస్ లైట్లు తమ మీద పడటంతో ఉలిక్కిపడి ముఖాలు దాచుకున్న వైనం
  • ఇదివరకు ఆండీ బైరన్, తాజాగా హెచ్ఆర్ ఆఫీసర్ క్రిస్టిన్ రాజీనామా
హెచ్‌ఆర్‌తో సన్నిహితంగా మెలిగినట్లు వెలుగు చూడటంతో అమెరికా ఐటీ కంపెనీ ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరన్ తన పదవి నుంచి వైదొలిగారు. తాజాగా, మహిళా హెచ్ఆర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆండీ బైరన్ అదే సంస్థలో పనిచేసే మహిళా హెచ్ఆర్‌తో సన్నిహితంగా మెలిగినట్లు వార్తలు వచ్చాయి. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆండీ సీఈవో పదవి నుండి వైదొలిగారు.

మసాచుసెట్స్‌లోని ఫాక్స్‌బరోలోని జలెట్ స్టేడియంలో ఇటీవల కోల్డ్ ప్లే కచేరీ జరిగింది. ఇందులో కంపెనీ హెచ్ఆర్ విభాగంలోని చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్‌ను కౌగిలించుకొని కచేరీ ఆస్వాదిస్తున్న సీఈవో ఆండీ బైరన్ కెమెరా కంటికి చిక్కాడు. ఫోకస్ లైటు తమ మీద పడగానే వారు ఉలిక్కిపడి ముఖాలు దాచుకున్నారు. ఈ క్రమంలో వారు తమ పదవులకు రాజీనామా చేశారు.
Andy Byran
Astranmer
IT Company CEO
Christine Cabot
HR Resignation
CEO Resignation

More Telugu News