ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి.. వీడియో ఇదిగో!
రెండు రాష్ట్రాల్లోని వాగులు, వంకలు, నదులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.