Narendra Modi: మోదీ విదేశీ పర్యటనలు.. మూడేళ్లలో రూ.295 కోట్ల ఖర్చు

Narendra Modi Foreign Trips Cost Rs 295 Crore in Three Years
  • ఒక్క ఫ్రాన్స్ పర్యటనకే రూ.25 కోట్లు
  • ఇటీవలి ఐదు దేశాల పర్యటనకు రూ.67 కోట్లు
  • రాజ్యసభలో కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇందులో మోదీ పర్యటనలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందనే వివరాలను ఆయన వెల్లడించారు.

2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.295 కోట్లు వెచ్చించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటన (2025) కే రూ.25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ లో మోదీ అమెరికా పర్యటనకు రూ.22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోదీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం రూ.67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ ఏడాదిలో మోదీ మారిషస్, సైప్రస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. అయితే, ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం మంత్రి వెల్లడించలేదు.
Narendra Modi
Modi foreign trips
India PM
foreign tours expenditure
France tour cost
USA visit expenses
Kirti Vardhan Singh
Rajya Sabha
TMC MP Derek O Brien
government spending

More Telugu News