Ghaziabad Robbery: నగల దుకాణంలో పట్టపగలే దోపిడీ.. వీడియో ఇదిగో!

Ghaziabad Jewelry Store Looted by Men in Delivery Uniforms
  • స్విగ్గీ, బ్లింకిట్ డ్రెస్సులు, హెల్మెట్లు ధరించిన దొంగలు
  • ఐదారు నిమిషాల్లోనే షాపును ఊడ్చుకెళ్లారన్న యజమాని
  • ఘజియాబాద్ లో చోరీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
ఫుడ్ డెలివరీ యాప్ సంస్థల యూనిఫాం ధరించి వచ్చిన ఇద్దరు యువకులు ఓ నగల దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఐదారు నిమిషాల్లోనే షాపు మొత్తం ఊడ్చుకెళ్లారు. ఈ దొంగతనం ఘజియాబాద్ లో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. షాపు యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్ లు స్విగ్గీ, బ్లింకిట్ డ్రెస్సులు ధరించిన ఇద్దరు యువకులు షాప్ లో చొరబడ్డారు. ముఖం కనిపించకుండా హెల్మెట్లు ధరించారు. లోపలికి వస్తూనే అక్కడున్న సేల్స్ మెన్ పై దాడి చేశారు.

దుకాణంలోని బంగారు, వెండి ఆభరణాలను తమతో తెచ్చుకున్న బ్యాగులలో వేసుకున్నారు. కుర్చీతో అద్దాలు పగలగొట్టి మరీ నగలు తీసుకున్నారు. ఆపై బైక్ మీద పరారయ్యారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయగా.. పదిహేను నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారని బాధితుడు తెలిపాడు. దుకాణంలోని 20 కిలోల వెండి ఆభరణాలు, 125 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారని వివరించాడు. కాగా, షాపులోని సీసీటీవీ కెమెరాలో ఈ దొంగతనం మొత్తం రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ghaziabad Robbery
Ghaziabad
Jewelry Store Robbery
Swiggy
Blinkit
Uttar Pradesh Crime
Gold Jewelry Theft
Silver Jewelry Theft
Robbery Video
Crime News

More Telugu News