Walking: నడకతో డిప్రెషన్ ను దూరం పెట్టొచ్చు.. రోజుకు 7 వేల అడుగులు చాలట

Walking 7000 Steps Daily Reduces Depression Risk
  • లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
  • డయాబెటిస్ ముప్పునూ తగ్గించుకోవచ్చని నిపుణుల వెల్లడి
  • హృద్రోగాలు, క్యాన్సర్ ముప్పు కూడా గణనీయంగా తగ్గుతుందని వివరణ
నడక ఆరోగ్యాన్ని పెంచి రోగాలను దూరం పెడుతుందని తాజాగా మరో అధ్యయనంలోనూ వెల్లడైంది. ఇప్పటి వరకు తెలిసిన ప్రయోజనాలతో పాటు డిప్రెషన్, డయాబెటిస్, హృద్రోగాలు, క్యాన్సర్ వంటి ముప్పులను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ పాదాలకు పనిచెప్పడమే.. రోజుకు 7 వేల అడుగులు వేయడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చని తాజాగా లాన్సెట్ అధ్యయనంలో తేలింది. 2014 నుంచి 2025 మధ్య నిర్వహించిన 88 సర్వేల ఆధారంగా లాన్సెట్‌ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ సర్వేల్లో యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్‌, నార్వే వంటి దేశాల్లోని 1.6 లక్షల మంది వాలంటీర్లు, పరిశోధకులు పాల్గొన్నారు.

7 వేల అడుగుల నడకతో ప్రయోజనాలు..
  • మరణం ముప్పును తగ్గించుకోవచ్చు. రోజుకు 2 వేల అడుగులతో పోలిస్తే 7 వేల అడుగులు వేసే వారికి మరణ ముప్పు 47 శాతం తగ్గుతుంది
  • డిప్రెషన్‌ ముప్పు 22 శాతం, క్యాన్సర్‌ వచ్చే అవకాశం 6 శాతం, డిమెన్షియా ముప్పు 38 శాతం, క్యాన్సర్‌ మరణాల ముప్పు 37 శాతం తగ్గుతుంది
  • హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 25 శాతం, టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు 14 శాతం మేర తగ్గుతుందట
Walking
Walking benefits
Depression
Diabetes
Heart disease
Cancer
7000 steps
Lancet study
Health benefits of walking
Walking for health

More Telugu News