Jagdeep Dhankhar: త్వరలో అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్న జగ్‌దీప్ ధన్‌ఖడ్

Jagdeep Dhankhar to Vacate Official Residence Soon
  • మంగళవారం నుంచి వస్తువులను ప్యాక్ చేసుకుంటున్న ధన్‌ఖడ్
  • పదిహేను నెలలుగా వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో ఉంటోన్న ధన్‌ఖడ్
  • లుటియన్స్ ఢిల్లీలో టైప్ VIIIలో బంగ్లా కేటాయించే అవకాశముందని ప్రచారం
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ త్వరలో తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే యోచనలో ఉన్నారు. ధన్‌ఖడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ధన్‌ఖడ్ మంగళవారం నుంచి తన వస్తువులను ప్యాక్ చేసుకోవడం ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ సమీపంలోని చర్చి రోడ్డులో నూతనంగా నిర్మించిన వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌కు ధన్‌ఖడ్ గత ఏడాది ఏప్రిల్‌లో మారారు. ఉప రాష్ట్రపతి అధికారిక నివాసం, కార్యాలయంగా ఉండే ఈ ఎన్‌క్లేవ్‌ను సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. గత 15 నెలలుగా జగ్‌దీప్ ధన్‌ఖడ్ అక్కడే నివాసం ఉంటున్నారు.

ధన్‌ఖడ్‌‍కు లుటియన్స్ ఢిల్లీలో టైప్ VIII లేదా మరో ప్రాంతంలో బంగ్లా ఇచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా టైప్ VIII బంగ్లాను కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీల అధ్యక్షులకు కేటాయిస్తారు.
Jagdeep Dhankhar
Vice President of India
Droupadi Murmu
Vice President Enclave

More Telugu News