Mithun Reddy: జైల్లో ఉన్న మిథున్ రెడ్డి కోసం భోజనం తెచ్చిన పెద్దిరెడ్డి... వీడియో ఇదిగో!

Peddireddy Brings Food for Mithun Reddy in Jail
  • ఏపీ లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్ట్
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైనం
  • ఇంటి భోజనానికి అనుమతించిన కోర్టు
ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డికి ఒక పూట ఇంటి భోజనం అందించేందుకు కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు రాజమండ్రి జైలు వద్దకు భోజనం తీసుకువచ్చారు. జైల్లో మిథున్ రెడ్డిని కలిసి మాట్లాడారు. 

అనంతరం జైలు వెలుపల పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టెర్రరిస్టులను ట్రీట్ చేసే విధంగా ఇక్కడి పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. మిథున్ రెడ్డి ఒక ఎంపీ అని, ప్రజా ప్రతినిధులకు సౌకర్యాలు, గౌరవం అందించాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, వైద్య సమస్య ఉన్నప్పటికీ మిథున్ రెడ్డి ప్రత్యేక సౌకర్యాలు కోరే వ్యక్తి కాదని అన్నారు. తన కుమారుడు ఆరోగ్యంగా, సంతోషంగానే ఉన్నాడని వెల్లడించారు. కోర్టు ఒక పూట ఇంటి భోజనానికే అనుమతించిందని వెల్లడించారు. ఇటువంటి  పరిస్థితులను వైసీపీ శ్రేణులు అధిగమిస్తాయని, త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయని అన్నారు.
Mithun Reddy
Peddireddy Ramachandra Reddy
AP Liquor Scam
Rajahmundry Central Jail
YSRCP
Chandrababu Naidu
Andhra Pradesh Politics
Jail conditions
Political Arrest

More Telugu News