Rahul Gandhi: ట్రంప్ వ్యాఖ్యలపై మరోసారి కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్న

Rahul Gandhi Questions Center on Trumps Remarks
  • ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని కేంద్రం చెబుతుందా? అని వ్యాఖ్య
  • కేంద్ర ప్రభుత్వం అలా చెప్పదు.. కానీ అదే నిజమన్న రాహుల్ గాంధీ
  • కాల్పుల విరమణ చేయించినట్లు 25 సార్లు ట్రంప్ చెప్పారని వ్యాఖ్య
భారత్ - పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకు పాతికసార్లు చెప్పారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కాల్పుల విరమణ మాత్రమే కాదని, చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అన్నారు.

"కేంద్రం ఏమని చెబుతుంది? ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని చెబుతుందా? కానీ అలా చెప్పలేరు. అయితే అదే నిజం. ఇది కేవలం కాల్పుల విరమణ వరకే కాదు, మనం చర్చించాల్సిన చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. కాల్పుల విరమణ చేయించినట్లు 25 సార్లు ట్రంప్ చెప్పారు. అసలు ట్రంప్ ఎవరు? అది ఆయన పని కాదు కదా, ప్రధానమంత్రి సమాధానం ఇవ్వడం లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు.

భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పించామని మంగళవారం కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అన్నారు. ఈ ఘర్షణలో ఐదు విమానాలు కూలిపోయినట్లు చెప్పారు. కాకపోతే, ఏ దేశానివో మాత్రం వెల్లడించలేదు. ఈ ఘర్షణ అణుయుద్ధం వరకు వెళ్లలేదని అన్నారు.
Rahul Gandhi
Donald Trump
India Pakistan Ceasefire
India Pakistan Relations

More Telugu News