Ramu Rathod: 'రాను బొంబైకి రాను' .. కోటి తెచ్చింది నిజమే: రాము రాథోడ్
- ఆ పాట పాప్యులర్ అయింది
- అన్ని పాటలు అలా సక్సెస్ కావు
- బెంజ్ కారు కొనలేదన్న రాము రాథోడ్
- అదంతా పుకారేనని వెల్లడి
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా జానపద గీతాల జాతర నడుస్తోంది. ఇటు సినిమాలలో .. అటు ప్రైవేటు ఆల్బమ్స్ లో జానపద గీతాల జోరు సాగుతోంది. అప్పుడెప్పుడో 'బుల్లెట్ బండి' సాంగ్ చాలా పాప్యులర్ అయింది. ఏ ఫంక్షన్ లో .. ఏ స్టేజ్ పై చూసినా ఈ సాంగ్ మారుమ్రోగింది. ఇక ఇప్పుడు 'రాను బొంబైకి రాను' అనే పాట దూసుకుపోతోంది. ఈ సంచలనానికి .. సందడికి కారకుడు రాము రాథోడ్ అనే ఓ కుర్రాడు.
ఓ మారుమూల గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన రాము రాథోడ్, యూ ట్యూబర్ గా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన చేసిన 'రాను బొంబైకి రాను' సాంగ్ యూ ట్యూబ్ నుంచి కోటి రూపాయలు తెచ్చింది. దాంతో ఇప్పుడు చాలా మంది ఇలా ప్రైవేట్ సాంగ్స్ చేసే పనిలో పడ్డారు. ఊరు దాటకుండా ప్రపంచాన్ని ఊపేయవచ్చని నిరూపించిన రాము రాథోడ్, తాజాగా 'ఆర్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
'రాను బొంబైకి రాను' అనే పాట కోసం మేము చాలా కష్టపడ్డాం .. ఖర్చు చేశాము. ఆ సాంగ్ అంతగా వైరల్ అయిందంటే దానికి అంత దమ్ము ఉంది. మేం పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం దక్కినందుకు హ్యాపీగా ఉంది. ఇలా అందరి విషయంలో జరుగుతుందని చెప్పలేం. అదేదో బై లక్ లో అలా వెళ్లిపోయింది. అలాంటి ఒక అద్భుతం అన్ని పాటలకు జరగదు. ఇక నేను బెంజ్ కారు కొనేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతమాత్రం నిజం లేదు" అని చెప్పాడు.