ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- ఎఫ్ఎస్ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం
- ఈ నెల 28 నుంచి ఆగస్టు 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
- సెప్టెంబర్ లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారుల వెల్లడి
ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లోని డివిజన్లలో పోస్టింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లుగా నిర్ణయించింది. రిజర్వేషన్ ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుందని తెలిపింది.