Chiranjeevi: మెగాస్టార్ కళ్లలోకి చూస్తూ కథ చెప్పడం అంత తేలిక కాదు: దర్శకుడు వశిష్ఠ
- అందుకే 'బింబిసార 2' చేయలేదు
- రజనీకాంత్ గారికి కూడా ఒక కథ చెప్పాను
- ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదన్న వశిష్ఠ
- మెగాస్టార్ కి కథ చెబుతానని ఊహించలేదు
- వెంటనే ఆయన ఓకే చేస్తారని అనుకోలేదని వెల్లడి
చిరంజీవి కథానాయకుడిగా 'విశ్వంభర' రూపొందుతోంది. ఈ సినిమాకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ నేపథ్యంలో 'గ్రేట్ ఆంధ్ర' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ సినిమాను గురించి వశిష్ఠ మాట్లాడారు. 'బింబిసార' తరువాత నేను 'బింబిసార 2' చేయవలసి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు వేరేవాళ్లు చేస్తేనే బాగుంటుందని భావించి నేను బయటికి వచ్చేశాను"అని అన్నారు.
" అంతకుముందే నేను రజనీకాంత్ గారి కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాను. ఆయనకి వినిపించాలని అనుకున్నాను. ఆ కథ నచ్చడంతో దిల్ రాజుగారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా చేసేశారు. రజనీకాంత్ గారికి కథ చెప్పాను .. ఆయనకి నచ్చింది కూడా. కాకపోతే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అలాంటి పరిస్థితులలోనే చిరంజీవిగారికి కథని వినిపించే ఛాన్స్ వచ్చింది" అని చెప్పారు.
" నేను ఎంతగానో అభిమానించే మెగాస్టార్ ముందు కూర్చున్నాను అనే ఆలోచనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బెరుకుగా .. భయంగా మాత్రం అనిపించలేదు. ఎందుకంటే చిరంజీవిగారు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. అలాగని చెప్పి చిరంజీవిగారి కళ్లలోకి చూస్తూ కథ చెప్పడం కూడా అంత తేలికైన విషయమేం కాదు. కథ విన్న తరువాత తన నిర్ణయాన్ని చెప్పడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోరు. ఈ సినిమా చేస్తున్నామని చెప్పగానే, ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని అన్నారు.